Tuesday, February 17, 2026

హామీల మోసం…. అవినీతి రాజ్యం గజ్వేల్ ను దోచుకున్న గత ప్రభుత్వం – గత ప్రభుత్వంపై సారిక శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు

నేటి సాక్షి గజ్వేల్ :—–గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో గజ్వేల్‌ను అవినీతి కేంద్రంగా మార్చిందని, పేదలు–దళితులకు ఇచ్చిన హామీలన్నింటినీ మరిచి ప్రజలను మోసం చేసిందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఐదవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సారిక శ్రీనివాస్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో పేదలకు 5 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిన హామీలను మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. గెలిచిన తరువాత ఒక్కసారి కూడా పేదల గడప తొక్కలేదని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రతి పేదవాడి కడుపు నింపేలా సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి రుణ విముక్తి కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని పేర్కొన్నారు.మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.గత 15 ఏళ్ల పాలనలో ఒక్క కుటుంబానికైనా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడాదిలోపే ప్రజలు కోరుకున్న ప్రజాపాలన అందిస్తోందని అన్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.గత ప్రభుత్వ మోసాలు, అవినీతిని ప్రజలు గుర్తించాలనీ, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి తనను ఐదవ వార్డు కౌన్సిలర్‌గా గెలిపించాలని సారిక శ్రీనివాస్ రెడ్డి ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, కొల్లూరి సత్యనారాయణ, రాంబాబు, మామిడి సురేష్, గోపిశెట్టి అశోక్, గజ్వేల్ సాయిలు, బద్రి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News