Wednesday, March 11, 2026

*అంగన్వాడి కేంద్రంలో అక్షరాభ్యాసం*

*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలోనీ అంగన్వాడి కేంద్రం1, 4 లో శుక్రవారం వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆరోగ్య సూత్రాల మీద ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, వాటి ప్రాధాన్యత బలమైన ఆహార పోషకాల విలువలపై తెలుపుతూ వైద్యుల సూచన మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాసారపు భవాని అరవింద్ గౌడ్, అంగన్వాడి సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడి టీచర్లు .జెల, రమాదేవి వి.రమాదేవి .స్వప్న, గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్, వార్డు సభ్యురాలు కాళ్ళ జమున, తల్లులు, గ్రామ ప్రజలు, గారు పాల్గొనడం జరిగింది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News