Thursday, March 26, 2026

*అంగన్వాడి కేంద్రంలో ఫుడ్ పాయిజన్ 8 మంది చిన్నారులకు అస్వస్థత* *ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారులు-నిలకడగా చిన్నారుల ఆరోగ్యం*

నేటి సాక్షి నవంబర్ 20 పాములపాడు:- అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తిన్న 8 మంది చిన్నారులకు తీవ్రస్వస్థకు గురైన ఘటన మండలంలోని, మిట్టకందాల గ్రామంలో బుధవారం కలకలం రేపింది. రోజువారి వలె గ్రామంలోని, అంగన్వాడీ కేంద్రం-3 లో మధ్యాహ్నం భోజనం కింద చిన్నారులకు ఆకుకూర పప్పు, అన్నం, కోడిగుడ్డు పెట్టారు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వెళ్లిన చిన్నారులకు వాంతులు, విరేచనాలుతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అస్వస్థకు గురైన చిన్నారులు రితిక, రిసి, నిక్షిత్ కుమార్, వసుంధర, చైతన్యకుమార్, అలేఖ్య, సంధ్య, చార్లెస్ రాజు, ఉన్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులను తల్లిదండ్రులు ఆశ వర్కర్ సహాయంతో ఆ గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రం దగ్గరికి తీసుకెల్లి అక్కడ నుండి పాములపాడు పిహెచ్సికి తరలించారు. చిన్నారులకు తీవ్ర అస్వస్థతగా ఉండడంతో అక్కడి నుండి ఆత్మకూరులోని వామిక పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఒకరి పరిస్థితి ఇబ్బందిగా ఉండడంతో నందికొట్కూరులో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. చిన్నారులకు అందించిన ఆహారంలో ఫుడ్ పాయిజన్ అయిన ఘటనపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో అందజేసిన ఆహారం ఎలా కలుషితమైందని దానిపై చిన్నారుల తల్లిదండ్రులు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. మా పిల్లల ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యానికి అయినటువంటి డబ్బులు ఎవరు భరిస్తారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లు- ఖాశీం వలి, వెంకటరాముడు లు మిట్టకందాల గ్రామ అంగన్వాడి కేంద్రాన్ని చేరుకొని ఆహారం, గుడ్లు, పాల ప్యాకెట్లను సేకరించి, వాటి నమూనాలను ల్యాబ్ కు పంపించి తదుపరి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండల అధికారులు తహాసిల్దార్- జి.సుభద్రమ్మ ఎంపీడీవో-ఎన్.చంద్రశేఖర్, ఎస్సై- కె.సురేష్ బాబు, నందికొట్కూరు సిడిపిఓ- మంగవల్లి, పాములపాడు మెడికల్ ఆఫీసర్ ఇ.వి.నాగలక్ష్మి దేవి, నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు, హెల్త్ సూపర్వైజర్లు మల్లికార్జున, మద్దయ్య, తదితరులు చేరుకొని అంగన్వాడి వర్కర్ అరుణమ్మ నుండి వివరాలను సేకరించారు. చిన్నారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News