Thursday, March 5, 2026

అంగన్వాడి కేంద్రం ఆకస్మిక తనిఖీ – చిన్నారుల సంక్షేమమే ప్రాధాన్యం: కౌన్సిలర్ కాముని మురళి నేటి సాక్షి గజ్వేల్..

.గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో గల అంగన్వాడి కేంద్రాన్ని స్థానిక కౌన్సిలర్ కాముని మురళి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలో అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించి, చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్యా కార్యక్రమాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయని అన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న పోషకాహారం, గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు అందించే సేవలు సక్రమంగా చేరాలనే ఉద్దేశంతో ఈ సందర్శన చేపట్టినట్లు తెలిపారు. పిల్లలకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి నాణ్యతపై సిబ్బందిని ప్రశంసించారు.కేంద్రంలోని హాజరు నమోదు పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్, పోషకాహార సరఫరా వివరాలు పరిశీలించిన ఆయన, శుభ్రత మరియు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైన మౌలిక సదుపాయాల మెరుగుదలకు తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.చిన్నారుల ఆరోగ్యం, విద్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, ఆయాలు, వార్డు నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంగిశెట్టి రాజు, హెచ్ఎం చంద్రకళ, రాజు,అంగన్వాడీ శీరీష, అనిత,టీచర్ అలివేణి హరిత, భవిత సెంటర్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆశ జ్యోతి ఏఎన్ఎం అరుణ, ఆశాలు స్వప్న, సంతోష ల తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News