నేటి సాక్షి, అన్నమయ్య, శర్మ ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని బి. కొత్తకోట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ములకలచెరువు మండల కేంద్రంలోని అన్ని అంగన్వాడి కేంద్రాలలో (ఐసీసీఈ) చిన్నపిల్లల సంరక్షణ మరియు విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సీడీపీఓ భాగ్యమ్మ తెలిపారు. శనివారం మండలంలోని వేపూరికోట పంచాయతీ రెడ్డివారిపల్లి అంగన్వాడి కేంద్రంలో ఇసీసీఇఈసీసీఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యమ్మ మాట్లాడుతూ 3 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు పాఠశాలలోని వస్తువుల ద్వారా పాత పాటలు, బొమ్మల ద్వారా ప్రీస్కూల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా పిల్లలకు శారీరకా అభివృద్ధి, భాషా వృద్ధి, మేధావృద్ధి, సృజనాత్మకాభివృద్ధి, సాంఘిక భావోద్వేగా అభివృద్ధిల గురించి పిల్లలకు తెలియజేయడం జరుగుతుందన్నారు. అన్ని అంగన్వాడి కేంద్రాలలో ఈ కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు చిన్న పిల్లలకు విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ భాగ్యమ్మ, అంగన్వాడి టీచర్ వెంకటరమణమ్మ, లలితమ్మ, హెల్పర్ శైలజ, ఈశ్వరమ్మ, పిల్లల తల్లులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~~

