నేటి సాక్షి జూపాడు బంగ్లా మార్చి3:– అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం, పెరుగుతున్న ఆర్థిక నిత్యవసర అధిక ధరలకు అనుగుణంగా జీతాల పెంపుదల కోసం, శాంతియుతంగా 30 గంటల ధర్నా చేస్తున్న వేలాది మంది నిద్రిస్తుండగా మహిళ కార్మికులు అనే గౌరవం లేకుండా ఇచ్చిన హామీ అమలు చేయమంటే మంగళవారం తెల్లవారుజామున విజయవాడ ధర్నా చౌక్ లో అక్రమంగా అరెస్టు చేసి వివిధ ప్రాంతాల పోలీస్ స్టేషన్ల కు తరలించడం సిగ్గు చేటు అయిన విషయమని అక్రమ రెస్టులు ఖండిస్తున్నామని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు ఒక ప్రకటనలో విమర్శించారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని, జీతాలు పెంచుతామని చెబుతూనే ప్రభుత్వం ద్వంద వైఖరి ప్రదర్శిస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుద్ధి మారలేదని, జీతాలు పెంచమని అడిగితే మహిళలని చూడకుండా వారిని నిర్బంధాలకు గురి చేయడం సిగ్గుచేటని వారు విమర్శించారు.అరెస్టుచేసిన అంగన్వాడీలు, వారి నాయకులను విడుదల చేయాలని డిమాండు చేసారు. అంగన్వాడీ యూనియన్ నాయకులతో ప్రభుత్వం వెంటనే చర్చించి వారి న్యాయమైన వేతనాల పెంపుదల డిమాండును పరిష్కరించాలని , ప్రభుత్వం తక్షణమే AITUC,CITU, IFTU అనుబంధ అంగన్వాడీల ప్రజా సంఘాల ప్రతినిధులను చర్చలకు పిలిపించి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.





