నేటి సాక్షి 12 నంద్యాల :—- గత వైసిపి ప్రభుత్వ హాయంలో అంగన్వాడీ కార్మికుల 42 రోజుల పాటు నిర్భంధాలను ఎదుర్కొని మెరుపు సమ్మె చేయడం జరిగిందని సమ్మె హామీల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అధికారంలోకి వచ్చినా కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని తక్షణమే సమ్మె కాలపు హామీలు అమలు చేయాలని, లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని *ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి.సుంకయ్య సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసు రత్నం లు పిలుపునిచ్చారు*.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఛలో కలెక్టరేట్ లో భాగంగా నంద్యాల కలెక్టర్ కార్యాలయాన్ని ఏఐటీయూసీ సీఐటీయూ సంఘాల జిల్లా నాయకులు జులేక,షేబా రాణి, ఆధ్వర్యంలో వందలాది మంది కలెక్టరేట్ ను ముట్టడించి విజయవంతం గా ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం. రమేష్ బాబు,ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి. సుంకయ్య సీఐటీయూ జిల్లా అధ్యక్షులు , యేసు రత్నం లు మాట్లాడుతు గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి మోసపూరిత వాగ్దానాలతో అంగన్వాడీ కార్మికులను మోసం చేసిందని అందుకే ప్రభుత్వం కుప్ప కూలిపోయింది అన్నారు. కనీస వేతనం అమలు చేయడంలో విఫలం చెందిందని వారు విమర్శించారు.సమ్మె కాలం లో ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ప్రభుత్వం మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చి తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట మంచి తడి గుడ్డతో గొంతు కోస్తున్నారన్నారు. వేతనాలు పెంపుదల చేస్తామని హామీ ఇచ్చారని నేడు మహిళ కార్మికులను విస్మరిస్తున్నారని వారన్నారు..తక్షణమే కనీస వేతనం ఈ ప్రభుత్వమైన అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎందుకు హామీల అమలకు నోరు మెదపడం లేదని వారు ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్ లుగా మార్చాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్లైన్లు రూపొందించి అమలు చేయాలన్నారు. అంగన్వాడీ వర్కర్స్ కీ సంక్షేమ పథకాల అమలు చేసి అన్ని యాప్ లను కలిసి ఒకే యాఫ్ గా మార్చాలని, అంగన్వాడీ సెంటర్ నిర్వాహనకు 5జీ ఫోన్లు ఇవ్వాలన్నారు. గ్రాట్యూటీ అమలుకు గైడ్లైన్స్ రూపొందించి పెండింగ్లో ఉన్న సూపర్వైజర్ పోస్ట్ లను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు..పై డిమాండ్స్ తో పాటు గత సమ్మె కాలపు వాగ్దానాల అమలు చెయ్యాలని లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని అంగన్వాడీ కార్మికులు తలుచుకుంటే ప్రభుత్వం పై దండ యాత్ర చేస్తామని అసెంబ్లీ ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఏఐటియుసి సిఐటియు నంద్యాల జిల్లా నాయకులు వసుందర దేవి, సీత మహా లక్ష్మి,వెంకటసుబ్బమ్మ, చంద్రకళ,సునీత, ఎస్తేరమ్మ, స్వర్ణలత, ఏఐటియుసి సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు డి శ్రీనివాసులు, గౌస్, లక్ష్మన్, బుమన శ్రీనివాసులు,మద్దతుగా సీపీఐ నాయకులు మురళీధర్, హరినాథ్,ధనుంజయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు లక్ష్మిదేవి, ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు, ఏ ఐ ఎస్ ఫ్ జిల్లా నాయకులు ఎర్రిస్వామి, శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..





