Tuesday, February 24, 2026

*అంగన్వాడీ కార్మికుల వేతనాలు 26 వేలకు పెంచాలి.సమ్మె కాలపు హామీలు అమలు చేయాలి.. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం. రమేష్ బాబు హెచ్చరిక*..

నేటి సాక్షి 23 ఫిబ్రవరి మిడ్తూరు :– రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో 42 రోజుల మెరుపు సమ్మె కాలంలో శిబిరాలకు వచ్చి అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని మద్దతు తెలిపిన నేటి అధికార పార్టీ ఇచ్చిన హామీనీ అమలు చేయకుండా మోసపూరితంగా నిర్లక్ష్యం చేయడం తగదని తక్షణమే అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనం 26వేలు ఇవ్వాలని,ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని లేనిపక్షంలో మరో మెరుపు సమ్మెకు పిలుపునిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు హెచ్చరించారు.. సోమవారం మిడతూరు తాసిల్దార్ కార్యాలయం ఎదుట రాణేమ్మ అధ్యక్షతన అంగన్వాడీ కార్మికుల రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ రిలే దీక్షలను ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు ప్రారంభిస్తూ మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా వేతనాలు పెంపుదల చేయాలని పోరాటం చేస్తున్న అంగన్వాడీ కార్మికులకు పాలకు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయన్నారు. పెండింగ్లో ఉన్న 1810మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుటి అమలకు గైడ్లైన్స్ రూపొందించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అర్బన్ రూరల్ తేడా లేకుండా అందరికి అమలు చేయాలని డిమాండ్ చేశారు,హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రూపొందించి అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. మే నెల అంతా వేసవి సెలవుల జీఓ విడుదల చేయాలని, లబ్ధిదారులకు బియ్యం, ఆయిల్, కందిపప్పు, క్వాంటిటీ పెంచి మెనూ చార్జీలు పెంచాలని, ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు,ఫ్రీ స్కూల్ బలోపే తం చేసి ప్రీస్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని,ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరినీ అంగన్వాడి సెంటర్లో ఉంచే విధంగా జీవో ఇవ్వాలన్నారు. పెరుగుతున్న నిత్యవసర వస్తువులు ధరలకు అనుగుణంగా ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల వేతనాలు పెంపుదలపై దృష్టి కేంద్రీకరించి కనీస వేతనం అమలు చేయాలన్నారు. గత సమ్మేకాలంలో ఎన్ని నిర్బంధాలు పెట్టిన లాఠి చార్జీలు చేసిన,ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ముందు నిలిచిన అంగన్వాడీలకు ఈ ప్రభుత్వం మద్దతు ఇచ్చినట్టు ఇచ్చి ఇప్పుడు విస్మరించడం తగదు అన్నారు. తక్షణమే వీరి సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు తప్పవని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కమల,సౌజన్య, పుణ్యవతి ,సువర్ణ, కమల, వరలక్ష్మి, రవణమ్మ,శైలజ, మహాదేవి, భాగ్యమ్మ, ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News