నేటి సాక్షి బుగ్గారం జనవరి 5.జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం శేకల్ల గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో సోమవారం రోజున అన్నప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్నారులకు సాంప్రదాయ బద్ధంగా అన్న ప్రసన్న చేసి బాలామృతం కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పర్స రమేష్ ఉప సర్పంచ్ ,నార్ల బుచ్చయ్య,మరియు వార్డు మెంబర్లు ,తల్లులు, గ్రామ ప్రజలు ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ,పల్లె దవాఖాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

