Wednesday, March 18, 2026

*అంగన్వాడీ వర్కర్స్ కు 5జీ ఫోన్లు అందించిన ఎమ్మెల్యే ఆరణి*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతితిరుపతి అర్బన్ ప్రాజెక్ట్ రాస్ ఆధ్వర్యంలోని అంగన్వాడీ సూపర్ వైజర్స్, వర్కర్స్ కు ప్రభుత్వం మంజూరు చేసిన 5జీ ఫోన్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శుక్రవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పంపిణి చేశారు. సీడీపీఓ సుధారాణి ఆధ్వర్యంలో అంగన్వాడీ సూపర్ వైజర్స్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఫోన్ల పంపిణి లో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పారదర్శకంగా అందించేందుకు 5జీ ఫోన్లు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నదని దీనికి అనుగుణంగా ఉద్యోగులు మారాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అంగన్వాడీ వర్కర్స్, సూపర్ వైజర్స్ నిత్యం వినియోగించే యాప్స్ లో డేటా అప్లోడ్ చేసేందుకు 5జీ నెట్వర్క్ కలిగిన ఫోన్లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలు సంపూర్ణంగా సాధించాలంటే కచ్చితమైన సమాచారం అంగన్వాడీ లు అందించాలని ఆయన కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News