నేటి సాక్షి తిరుపతి *ఎస్ఆర్ పురం* మండలంలోని మెదవాడ పంచాయతీ మర్రిపల్లి గ్రామం వద్ద నిర్వహిస్తున్న ఎంపీఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంటు గత ఐదు రోజులుగా నిర్వహించారు మంగళవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఫైనల్ మ్యాచ్ కోసం టాస్ వేశారు.. అనంతరం ఫైనల్ మ్యాచ్లో పెద్ద తయ్యూరు జట్టువిజేతగా నిలిచింది కార్వేటి నగరం మండలం గోపిశెట్టిపల్లి జట్టు రన్నర్ గా నిలిచింది ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మొదటి బహుమతి పొందిన పెద్దతయ్యరు జట్టుకు నగదు 40000 రూపాయలు నగదును అందించారు అలాగే కప్పును కూడా అందించారు, రన్నర్ గా నిలిచిన గోపిశెట్టిపల్లి జట్టుకు 20వేల రూపాయలు నగదు బహుమతితో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అనిల్ కుమార్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నవీన్ కుమార్ అవార్డుతో పాటు మెడల్ అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో అవసరం అని అన్నారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని క్రీడలను క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ఆస్వాదించాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో దాగివున్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. క్రీడ అభివృద్ధి కోసం నియోజకవర్గ స్థాయిలో అతి త్వరలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొదటి బహుమతి స్పాన్సర్ గా సాఫ్ట్వేర్ బాలు వ్యవహరించారు అలాగే ఈ ఎంపీ ఎల్, క్రికెట్. ఆర్గనైజర్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ తిరుమల, మహేష్, ప్రణయ్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో బిజెపి ఇన్చార్జ్ రాజేంద్ర, టిడిపి జిల్లా కార్యదర్శి రాజశేఖర్ నాయుడు ఎస్ఆర్ పురం మండలం సింగల్ విండో చైర్మన్ నిరంజన్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి వెంకటాచలం, పుల్లూరు తరుగు బాబు, జలేంద్ర నాయుడు గజేంద్ర ఖాదర్ బాషా, సురేష్ గుండయ్య మునిరత్నం రెడ్డి, తదితరులు .

