Thursday, March 19, 2026

అంగరంగ వైభవం గా భక్తి శ్రద్ధలతో ఓం శక్తి పూజా కార్యక్రమం

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 12పుంగనూరు నియోజవర్గం చౌడేపల్లి పట్టణం లో గడ్డంవారిపల్లి రోడ్డు నందు నూతనంగా నిర్మించిన మేల్ మవత్తూరు ఓం శక్తి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఘనంగా పటం పూజ నిర్వహించడం జరిగింది ఓం శక్తి అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించి, పంచామృతాభిషేకం చేసి, వచ్చిన భక్తులకు ఉదయం ఏడు గంటల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు,గురుశక్తి పప్పు సావిత్రమ్మ మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాలనుండి ఓం శక్తి అమ్మవారి మాలధారణ చేసి, సరైన దేవస్తానంలేక చాలా ఇబ్బందులు పడ్డామని, ఈ ఏడు ఖచ్చితంగా అమ్మవారి ఆశిస్సులతో ఓం శక్తి ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని, దాతల సహాయ సహాకారాలతో సుమారు ముప్పై లక్షలతో అమ్మవారి ఆలయ నిర్మాణం చేశామని,ఇంకనూ కొంత నిర్మాణము ఉందని, ఎవరైనా దాతలు ముందుకు వస్తే పూర్తిస్థాయిలో నిర్మాణం చెస్తామని ఆవిడ తెలిపారు. అంతే కాకుండా శుక్రవారం నుండి ఇక్కడ మాలధారణ కార్యక్రమం జరుగుతుందని ఆవిడ తెలియజేశారు.అలాగే జనవరి చివరిదాకా ఓం శక్తి ఆలయం నందు పూజాకార్యక్రమాలు జరుగుతాయని, చుట్టుప్రక్కల ప్రజలు, ఓం శక్తి అమ్మవారి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గురుశక్తి సావిత్రమ్మ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శక్తులు రమాదేవి, రామలక్ష్మి,చిన్నక్క, ఉత్తరాది గీత,క్రిష్ణప్ప,హరిప్రసాద్,అమర, మల్లికార్జున, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News