నేటి సాక్షి, అందోల్: అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో మున్సిపల్ కమిషనర్ తిరుపతి వార్డు కౌన్సిలర్ కోరబోయిన నాగరాజ్ (నాని) 14 వ ప్రణాళికా సంఘం నిధుల నుంచి రూ. 8 లక్షల నిధులతో నిర్మిస్తున్నఅండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నాగరాజు మాట్లాడుతూ 12వ వార్డును జోగిపేట్ పట్టణంలో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామన్నారు. వార్డు ప్రజలకు నిరంతరమూ అందుబాటు ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శరత్ బాబు, నాయకులు వుస నాగరాజ్, శ్రీశైలం, ప్రభు, డాకూరీ పాపయ్య, మల్లేశం, వెంకటేశం, రాజు యాదగిరి, శ్రీనివాస్, విఠల్ శివకళ, పద్మ తదితరులు పాల్గొన్నారు.