నేటి సాక్షి,నారాయణపేట, అక్టోబర్ 20, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రానికి చెందిన జి వికాస్ అనే విద్యార్థి అండర్ 14 కబడ్డీ నేషనల్ సెలెక్ట్ కావడంతో మరికల్ గ్రామ యువకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, గ్రామస్తులు సోమవారం అభినందించారు. జి వికాస్ కబడ్డీ పోటీలలో నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందినందుకు తల్లిదండ్రులు అయినా జి. చెన్నయ్య కు గ్రామస్తులు అభినందించారు. జి వికాస్ రాబోయే రోజుల్లో క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని మరికల్ మండల యువజన సంఘాలు, గ్రామ సంఘాలు గ్రామస్తులు కోరారు





