నేటి సాక్షి, గన్నేరువరం, బుర్ర అంజయ్య గౌడ్):
గన్నేరువరం : గన్నేరువరం టియుడబ్ల్యూజె (ఐజేయు) ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు మ్యాదరి శ్రీనివాసు ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండలం అనంతగిరి పోచమ్మ దేవాలయంలో ప్రెస్ క్లబ్ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి అనంతరం సంయుక్త భోజనాలు చేశారు. అమ్మవారు చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు బుర్ర రాజ్ కోటి గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎలుక రాజు,కార్యదర్శి తుమ్మ సతీష్, కోశాధికారి తేళ్ల రవీందర్, ప్రెస్ క్లబ్ సభ్యలు బోడ ప్రతాప్ రెడ్డి, బుర్ర అంజయ్య గౌడ్,బద్దం రమణ రెడ్డి, ఇనుకొండ లక్ష్మణ్,బుర్ర కోటేష్ గౌడ్ పాల్గొన్నారు.

