నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, డిసెంబర్ 18: అంతర్జాతీయ ఉపాధి రంగంలో ది అపోలో యూనివర్సిటీ మరో ఘనత నమోదు చేసింది. యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు చెందిన డివిజన్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌లోని బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ విద్యార్థులు ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో అపోలో హాస్పిటల్స్ నిర్వహణలోని ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్సెస్ హాస్పిటల్‌లో రేడియాలజీ టెక్నీషియన్లుగా అంతర్జాతీయ ఉద్యోగాలు సాధించారు. ఈ ప్లేస్‌మెంట్‌లో గుంటూరుకు చెందిన అరుణ్‌కుమార్ సురవరపు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సయ్యద్ ఇమామ్ ఖాజా ఎంపిక కయ్యారు. అత్యున్నత వేతన ప్యాకేజీతో పాటు వసతి, భోజనం, విమాన టికెట్లు, వీసా ప్రక్రియ వంటి అదనపు సదుపాయాలను కూడా వారు ఉచితంగా పొందనున్నట్లు యూనివర్సిటీ ప్లేస్‌మెంట్ అధికారులు తెలిపారు. అపోలో యూనివర్సిటీ నుంచి విద్యార్థులు విదేశీ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు పొందడం యూనివర్సిటీ అకడమిక్ నాణ్యతకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా విదేశాల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. హెచ్. వినోద్ భట్ అభినందించారు. ఈ విజయం ద్వారా యూనివర్సిటీలో అమలవుతున్న బలమైన అకడమిక్ పునాది, ఆధునిక క్లినికల్ శిక్షణ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన విద్యా విధానం స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ హెల్త్‌కేర్ అవసరాలకు తగిన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడంలో అపోలో యూనివర్సిటీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డీన్ ప్రొ. కె. భాస్కర్‌రెడ్డి, ఇతర ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొని ఎంపికైన విద్యార్థులను అభినందించారు. అంతర్జాతీయ కెరీర్ అవకాశాలను అందించిన అపోలో హాస్పిటల్స్‌కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.రేపు అపోలోలో జాతీయ సదస్సుచిత్తూరులోని ది అపోలో యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో శనివారం “హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్”పై ఒకరోజు జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు దక్షిణాది నాలుగు రాష్ట్రాల నుంచి 150 మందికిపైగా ప్రతినిధులు హాజరుకానున్నారు.సదస్సుకు ముఖ్య అతిథిగా కడప యోగి వేమన యూనివర్సిటీ వైస్–ఛాన్సలర్ ప్రొ. రాజశేఖర్ బెల్లమకొండ పాల్గొననున్నారు అపోలో యూనివర్సిటీ వైస్–ఛాన్సలర్ డా. హెచ్. వినోద్ భట్, రిజిస్ట్రార్ ప్రొ. ఎం. పోతరాజు ఈ కార్యక్రమానికి ప్రధాన మార్గదర్శకులుగా వ్యవహరించనున్నారు. అతిథులుగా అపోలో నాలెడ్జ్ సిటీ సీఈఓ శివరామకృష్ణన్ వెంకటేశ్వరన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డీన్ ప్రొ. జి.వి.ఆర్.కె. ఆచార్యులు పాల్గొంటారు. ఈ సదస్సుకు స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డీన్ డా. రామయ్య ఇటుమల్ల కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌లో వస్తున్న ఆధునిక మార్పులు, సవాళ్లు, అవకాశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. పలువురు నిపుణులు హెల్త్‌కేర్ రంగంపై ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నారు.





