తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా గోవిందు నాగరాజు.
నేటి సాక్షి,నర్సంపేట, జూన్ 11:అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామానికి చెందిన గోవిందు నాగరాజు ఎన్నికైనట్టు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం సౌత్ చైర్మన్ సయ్యద్ కాజిమ్ అలీ హష్మీ తెలిపారు ఈ సందర్బంగా గోవింద్ నాగరాజు మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని నా మీద నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్బంగా గోవిందు నాగరాజు కి స్నేహితులతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.

