నేటి సాక్షి, బాపట్ల జిల్లా క్రైమ్ ప్రతినిధి బాపట్ల జిల్లాలో వరుసగా చోటుచేసుకున్న ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను బాపట్ల జిల్లా సిసిఎస్ పోలీసులు, అమృతలూరు పోలీసులు సంయుక్తంగా చేదించి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చకచక్యంగా అరెస్ట్ చేశారని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసులు సంబంధించిన వివరాలను వెల్లడించారు. *కేసు వివరాలు*యద్దనపూడి మండలం, చిమట వారి పాలెం గ్రామంకు చెందిన థంకసాల సుబ్బారావు, S/o చెంచు రామయ్య (52 సంవత్సరాలు) తన AP 27 BY 9047 నంబర్ గల HF డీలక్స్ బైక్ను అమర్తలూరు మండలం ఇంటూరు గ్రామంలో ది:27.06.25 రాత్రి 20.00 గంటల సమయంలో పార్క్ చెయ్యగా గుర్తు తెలియని వ్యక్తులు దానిని దొంగిలించారని ఇచ్చిన రిపోర్ట్ మేరకు అమర్తలూరు పోలీస్ స్టేషన్ లో Cr.No: 89/2025 u/s 303(2)BNS గా కేసు నమోదు చేయడం జరిగింది. *ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను ఛేదించిన విధానం*బాపట్ల జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వర్ ఐపీఎస్ సవాలుగా తీసుకొని బాపట్ల సిసిఎస్ డిఎస్పి పి.జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో సిసిఎస్ సిఐ ప్రేమయ్య, అమృతలూరు ఎస్సై రవితేజ లు వారి సిబ్బందితో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, సీసీ కెమెరాల సమాచారం ఆధారంగా వరుసగా జరుగుతున్న బైక్ దొంగతనం కేసులను చాకచక్యంగా చేదించి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను అరెస్టు చేసి వారి నుండి దొంగిలించబడిన 16.5 లక్షల విలువ గల 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని వాటిని సీజ్ చెయ్యడం జరిగింది. *ముద్దాయిల వివరాలు* 1. కొమ్మ వెంకట సాయి S/O రమేష్, వయస్సు 20 సంవత్సరాలు, సీతయ్య నగర్, వినుకొండ 2. కొమ్మ సాయి కృష్ణ S/O రమేష్, వయస్సు 19 సంవత్సరాలు, సీతయ్య నగర్, వినుకొండ 3. సంపంగళి నాని S/O నరసింహారావు, వయసు 18 సంవత్సరాలు, రెడ్డి నగర్ 5వ లైన్, వినుకొండ 4. సయ్యద్ నాగూర్ వలి S/O పెద్దబాజీ, వయసు 20 సంవత్సరాలు, పెద్ద నాసా బజార్, వినుకొండ 5. బండి శివారెడ్డి S/O కోటిరెడ్డి, వయస్సు 32 సంవత్సరాలు, రామాపురం, పొదిలి మండలం, ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నారు 6. పందుల రమేష్ బాబు S/O జానీ, వయస్సు 26 సంవత్సరాలు, ముట్లగుంట, కాలనీ వినుకొండ.*ముద్దాయిలు నేరం చేసిన విధానం*ముద్దాయిలు సుమారు రెండు సంవత్సరాల నుండి చెడు వ్యసనాలకు అలవాటు పడి వారి విలాసాలకు డబ్బుల కోసం బైకులు దొంగతనం చేస్తున్నారు. ఇంటి ముందర పార్కింగ్ చేసి ఉన్న బైక్ లను, రైతులు పొలం పనులులకు వెళ్తూ పొలం గట్లు మీద పెట్టిన బైక్ లను దొంగ తాళాలతో లాక్ ఓపెన్ చేసి దొంగతనం చేస్తూ ఉంటారు. దొంగతనం చేసిన బైక్ లను వేరే జిల్లాలకు, తీసుకువెల్లి అక్కడ బైక్ మెకానిక్ షాపులలో అమ్ముతూ ఉంటారు. ముద్దాయిల మీద అంతకుముందు అనేక జిల్లాలలో కూడా కేసులు ఉన్నాయి. *కేసు చేదించిన పోలీసులకు ప్రశంసా*ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను సమర్ధవంతంగా చేదించి 6 గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి 23 ద్విచక్ర వాహనాలను సీజ్ చెయ్యడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 1.సిసిఎస్ డిఎస్పి పి జగదీష్ నాయక్ , 2సిసిఎస్ ఇన్స్పెక్టర్ ప్రేమయ్య 3.సిసిఎస్ ఎస్ఐ రవి ప్రకాష్,4. సిసిఎస్ ఎస్ఐ రాంబాబు,5. సిసిఎస్ కానిస్టేబుల్ కోటేశ్వర రెడ్డి,6. సిసిఎస్ కానిస్టేబుల్ క్రిష్ణ ,7. సిసిఎస్ కానిస్టేబుల్ సురేష్,8. సిసిఎస్ కానిస్టేబుల్ దాసు, 9. సిసిఎస్ కానిస్టేబుల్ చిరంజీవి,10. సిసిఎస్ హోంగార్డ్ రవూఫ్ ,11. అమర్తలూరు ఎస్సై కె రవితేజ, 12. అమర్తలూరు ఏఎస్ఐ పి సత్యనారాయణమూర్తి, 13. అమర్తలూరు కానిస్టేబుల్ పి అనిల్ కుమార్,14. అమర్తలూరు హోంగార్డు టి.రాజేష్ లను జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వర్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి కాష్ రివార్డులను అందజేశారు.ఈ పత్రిక సమావేశంలో సిసిఎస్ డిఎస్పి జగదీష్ నాయక్, రేపల్లె డి.ఎస్.పి శ్రీనివాసరావు, సిసిఎస్ సిఐ ప్రేమయ్య, చుండూరు సిఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు.





