త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు
- హైకోర్టు ఆదేశాలతో గ్రామాల్లో నెలకొన్న సందడి
- నరాలను గ్రామస్థాయిలో నిరూపణకు ఆశావహుల
- రిజర్వేషన్ల తర్వాతే స్థానం తేల్చుకోవాలని నేతల భావన
ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆరాటం.. మరోవైపు తమకు పట్టు ఉన్న గ్రామం, వార్డు రిజర్వేషన్ ఎలా ఉంటుందోనన్న ఆందోళన.. వెరసి ఆశావాహులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరో మూడు నెలల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గ్రామాల్లో చర్చ ఊపందుకుంది. జీపీలతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రామం మొదలు మండల స్థాయి నేతల వరకు రిజర్వేషన్లపై అంచనాల్లో నిమగ్నమయ్యారు.
లక్షెట్టిపేట – నేటి సాక్షి (రేగుంట ప్రసాద్), ప్రత్యేక కథనం :
ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆరాటం.. మరోవైపుతమకు పట్టు ఉన్న గ్రామం, వార్డు రిజర్వేషన్ ఎ ఉంటుందోనన్న ఆందోళన.. వెరసి ఆశావహులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా యి. మరో మూడు నెలల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యాన గ్రామాల్లో చర్చ ఊపందుకుంది. జీపీలతో పాటు జెడ్పీటీ సీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలియడంతో గ్రామం మొదలు మండల స్థాయి నేతల వరకు దృష్టి సారించి రిజర్వేషన్లపై అంచనాల్లో నిమగ్నమయ్యారు. గ్రామ పంచాయతీల్లో వార్డులు, సర్పంచ్ల రిజర్వేషన్ల మార్పుతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల నాటి రిజర్వేషన్లలో కాస్త మార్పు ఉంటుందా… సమూలంగా మార్పులు వస్తాయా అనే చర్చ సాగుతోంది. బరిలో నిల వాలనుకునే అభ్యర్థులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన నేపథ్యాన రిజర్వేషన్ల అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. సర్పంచ్ పదవికి బరిలో ఉండాలనుకునే నేతల్లో ఈ ఆందోళన ఎక్కువగా ఉంది. ఎంచుకున్న వార్డు లేదా సర్పంచ్ స్థానానికి గెలిచే అవకాశమున్నా ఎవరికి రిజర్వు అవుతుందో తేలకపోవడంతో అది ఖరారయ్యాకే పోటీ చేయడమా కుటుంబీకులను రంగంలోకి దించడమా నిర్ణయించుకోవాలనే భావనలో ఉన్నారు.
- వాయిదాలు పడుతూ..
2019 ఏడాదిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1042 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా… ఆ ఏడాది ఫిబ్రవరి 2న పాలక వర్గాలు పగ్గాలు చేపట్టాయి. వీరి పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1న ముగిసింది. దీంతో 16 నెల ల నుంచి గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. ఎన్ని కల నిర్వహణకు ఎన్నికల సంఘం, ప్రభు త్వం ప్రయత్నాలు చేస్తుండగా.. రిజర్వే షన్లు ఖరారు కాకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల కోర్టు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇవ్వడంతో గ్రామాల్లో ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి.
- రిజర్వేషన్ల చిక్కుముడి..
పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిశాక ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా వార్డులు. సర్పంచ్ల రిజర్వేషన్ల మార్పుతో తో సాధ్యం కాలేదు. 2019 ఎన్నికల సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభు త్వం గ్రామపంచాయతీ చట్టం – 2018ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం చేసిన రిజర్వేషన్లు పదేళ్ల పాటు కొనసాగాలి. అంటే ఈసారి కూడా అవే రిజర్వేషన్ల ప్రకారం నిర్వహించాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించడం తో రిజర్వేషన్లు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకోపక్క జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల ఖరారుపై బీసీ కమిషన్ కసరత్తు చేస్తోంది. చట్టసభలో బిల్లు ఆమోదం పొందడంతో రిజర్వేషన్ల మార్పు అనివార్యం కానుండగా.. ఈ ప్రక్రియ అలస్యం కారణంగా ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి.
- నెలరోజుల్లో తేలనున్న లెక్కలు..
కోర్టు తీర్పు నేపథ్యాన వచ్చే నెలరోజుల్లో వార్డులు, సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో మొత్తం 1042 గ్రామ పంచాయతీలు ఉండగా గత ఎన్నికల్లో అన్ని పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇటీవల కొన్ని మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డా యి. వీటిలో విలీన మైన జీపీ లు మినహాయిస్తే మిగిలిన పంచాయతీలకు ఎన్ని కలు జరగనున్నాయి. ఇందులో సర్పంచ్లు, వార్డు మెంబర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాక గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కనున్నాయి.
- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కూడా..
కోర్టు తీర్పుతో త్వరలోనే జీపీ ఎన్నికలు జరగనుండగా.. ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సైతం నిర్వహిస్తుందని తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 649 ఎంపీటీసీ స్థానాలు 60 జడ్పీటీసీ స్థానాలకు 2019 మే నెలలో ఎన్నికలు జరగ్గా.. పాలకవర్గాల గడువు తీరిపోయింది. అయితే ప్రస్తుతం ఎంపీటీసీ స్థానాలను కొన్ని పునర్విభజన చేశారు. పాత వాటితో పాటు కొత్త స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీ గుర్తుపై ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గ్రామాల్లో ఎన్నికలను స్వీప్ చేసి తమ పట్టు నిలుపుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుండగా.. అధికార పార్టీ వైఫల్యాలు తమకు కలిసి వస్తాయని ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా తమ ప్రయత్నాలు చేస్తున్నాయి.