Saturday, March 7, 2026

అందుబాటులో ఉండి ప్రజలు సమస్యలు పరిష్కరించాలి

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి మార్చి 7 గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై పరిష్కరించాలని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక మండల పరిపాలన భవనంలో ఎంపీడీవో తహసిల్దార్ కార్యాలయాల నందు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలం కావడంతో గ్రామీణ ప్రాంతాలందు ముఖ్యంగా తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు, అంతేకాకుండా పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ప్రతి అధికారి సమస్యల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలని ,ఆ స్థాయిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ,ఉపాధి హామీ పనులపై మండల స్థాయిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు .కూలీలు వలసలు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ,అనంతరం పంచాయతీల వారీగా సమీక్షించారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ,ఎంపీడీవో లీలా మాధవి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య ,పూల చంద్రమౌళి ,ముని వెంకటప్ప ,మనీ కళ్యాణ్ ,విజయభాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు,

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News