నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
అంధులు అన్ని రంగాలలో రాణించేందుకు సమర్థులే వారికి సరైన మార్గదర్శకం, శిక్షణ, అవసరమైన వనరులు అందితే వారు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించగలుగుతారు:జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు తిరుపతి రూరల్ తుమ్మలగుంట లోని కె వి ఎస్ పార్క్ లో. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ ఫర్ ది బ్లైండ్ ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. సోమవారం టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి క్రికెట్ అసోసియేషన్ బ్లైండ్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రెసిడెంట్ డేవిడ్ జాన్ ,భారత జాతీయ అంధ క్రికెట్ జట్టుకు ప్రస్తుత కెప్టెన్ అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి. ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శక్తిని మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తాయి ఈ కారణంగా అంధులకు ప్రత్యేక క్రీడా మైదానాలు, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలి అని తెలిపారు.ఆంధ్ర నుండి ఆరు జిల్లాల జట్లు ఇందులో పాల్గొంటారని తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెళ్లేందుకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు.. బైట్
ఈ కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి ప్రెసిడెంట్ శేష సాయి, గట్ల ఫౌండేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, దివ్యంగా సేవా సమితి ప్రెసిడెంట్ ముని లక్ష్మి క్రీడాకారులు పాల్గొన్నారు.