Saturday, February 14, 2026

*అంబేద్కర్ గురుకుల పాఠశాలకు రెగ్యులర్ వార్డెన్ నియమించాలి.. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్ బాబు*..

నేటి సాక్షి 14 ఫిబ్రవరి జూపాడుబంగ్లా :– సంవత్సర కాలం నుండి జూపాడు బంగ్లా అంబేద్కర్ గురుకుల పాఠశాలకు రెగ్యులర్ వార్డెన్ లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే జిల్లా కలెక్టర్ గారు దృష్టి కేంద్రీకరించి రెగ్యులర్ వార్డెను నియమించాలని లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్ బాబు హెచ్చరించారు. శనివారం సిపిఐ మండల నాయకులు మక్బూల్ బాషా, తిరుపతయ్యలతో కలిసి పాఠశాల డైనింగ్ హల్ ను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ గురుకుల పాఠశాల జిల్లాలోని అనేక ప్రాంతాల నుండి విద్యార్థులు చదువుకోవడానికి వస్తారని అయితే వారికి మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని వారన్నారు వార్డెన్ ఉంటే అన్ని రకాల వసతులతో పాటు కూరగాయలు, మౌలిక సదుపాయాలు సమస్యలు కూడా చూసుకుంటారని టీచర్స్ కి వార్డెన్ బాధ్యతలు అప్పగించడం వల్ల అటు వారు చదువు చెప్ప లేక విద్యార్థులకు భోజన వసతి మీద దృష్టి పెట్టలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.. 600 మంది విద్యార్థులకు వార్డెన్ లేకపోతే ఏలా అని వారు ప్రశ్నించారు.. తక్షణమే విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు భోజన సక్రమ వసతులు కల్పించేందుకు రెగ్యులర్ వార్డె ను నియమించాలని దీనివల్ల అవకతవకలకు చోటు ఉండదు అన్నారు. విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. వారు కోరారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News