నేటిసాక్షి, మిర్యాలగూడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యువజన సంఘం (రిజిస్ట్రేషన్ నెం. 1033/77) రాష్ట్ర కమిటీ వ్యవస్థాపకులు రిటైర్డ్ డాక్టర్ జె.బి. రాజు చీఫ్ అడ్ర్వైజర్, తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిప్పలపల్లి అవిలయ్య, రాష్ట్ర కార్యదర్శి బి. నాగరాజు తెలంగాణలో అంబేద్కర్ యువజన సంఘాలను గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, పట్టణ స్థాయి, నియోజకవర్గ స్థాయి కమిటీలను కొత్తగా నిర్మాణం చేసి ఇట్టి సంఘాన్ని తెలంగాణవ్యాప్తంగా బలోపేతం చేయాలని రాష్ట్ర కమిటీ అధ్యక్షులు చిప్పలపల్లి అవిలయ్య అధ్యక్షతన, రాష్ట్ర జనరల్ బాడీ సమావేశాన్ని హైదరాబాద్ నిర్వహించి, తీర్మాణం చేశారు. అట్టి రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం తీర్మాణం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలను బలోపేతం చేసే క్రమంలో గ్రామ/మండల/పట్టణ/ నియోజకవర్గస్తాయి నూతన కమిటీలను పుననిర్మాణం చేసి, ప్రకటించుటకు రాష్ట్ర కమిటీ వారు జిల్లాల వారీగా నల్లగొండ జిల్లా అధ్యక్షులైన కొండేటి వెంకట్ ని, జిల్లా వ్యాప్తంగా కమిటీలను కొత్తగా నిర్మాణం చేసి, రాష్ట్ర కమిటీకి నివేదిక అందించాలని తెలిపారు. రాష్ట్ర జనరల్ బాడీ సమావేశ తీర్మాణం ప్రకారం, వారి ఆదేశాలను నుండి మిర్యాలగూడ పట్టణ కమిటీ డివిజన్ కమిటీ కాలపరిమితి తేది 11.02.2024 నుండి తేది 11.02.2026 వరకు తీరినందున మరలా నూతన పట్టణ, నియోజకవర్గస్థాయి కమిటీలను నిర్మాణం చేయుటకు నల్లగొండ జిల్లా కమిటీ మన సంఘం రాష్ట్ర కమిటీ జాయింట్ సెక్రటరీ సమక్షంలో తీర్మాణం చేశారు. కావున ఉత్సాహ వంతులైన దళిత, గిరిజన, బహుజన ముస్లిం, మైనార్టీ సమాజికవర్గాల వారి పట్ల అవగాహన కలిగి డా॥ బి.ఆర్. అంబేద్కర్ సిద్ధాంతాల పట్ల సామాజిక ఉద్యమ నేపథ్యం కలిగిన యువకులను, మన సంఘం రాష్ట్ర జాయింట్ కార్యదర్శి పెరుమాల్ల బాలస్వామి, సమక్షంలో కొత్త కమిటీలను ఎన్నుకొనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.





