నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )*బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం*భారత రాజ్యాంగ నిర్మాత, సమానత్వ శిల్పి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కోరుట్ల బీజేపీ పట్టణ శాఖ తరఫున శుక్రవారం ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు. *ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి ప్రదాత*ఆయన చూపిన ప్రజాస్వామ్య స్ఫూర్తి, సామాజిక న్యాయ సిద్ధాంతాలు దేశాన్ని విశ్వవ్యాప్తంగా గౌరవనీయదేశంగా నిలబెట్టాయని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పట్టణ ప్రధాన కార్యదర్శులు చెట్లపెల్లి సాగర్, ఎర్ర రాజేందర్, జిల్లా కార్యదర్శి కస్తూరి లక్ష్మీనారాయణ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, ఫ్లోర్ లీడర్ మడవేని నరేష్, కౌన్సిలర్ పెండం గణేష్, ఇండూరి సత్యం, జిల్లా నాయకులు సూదవేని మహేష్, తిరుమల వాసు, పోతుగంటి శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు మైదం సత్యనారాయణ, గుంటుక నాగరాజు పాల్గొన్నారు. అలాగే బీజేవైఎం పట్టణ అధ్యక్షులు కళల సాయి చందు, నాయకులు రాగంశెట్టి సాయి, కంఠం శ్రీను తదితరులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి అర్పించారు._____





