Saturday, March 21, 2026

*అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ నివాళులు** మెట్ పల్లి – కోరుట్లలో విగ్రహాలకు పుష్పమాలలు* అంబేద్కర్ సిద్ధాంతాలే సమాజానికి దారిదీపం—-*

నేటి సాక్షి – కోరుట్ల/మెట్ పల్లి ( రాధారపు నర్సయ్య )డా. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మెట్ పల్లి, కోరుట్ల పట్టణాల్లోని ఆయన విగ్రహాలకు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు శనివారం పుష్పమాలలు చేసి నివాళులు అర్పించారు. *అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు..శక్తి.!*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అంబేద్కర్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, భారత ప్రజాస్వామ్యానికి దృఢమైన పునాది వేసిన మహానుభావుడ’ని పేర్కొన్నారు. అణగారిన వర్గాలు, పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం కోసం ఆయన చూపిన దిశ నేటికీ మార్గదర్శకమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంబేద్కర్ ఆలోచనలు యువతలో స్పూర్తిని నింపేలా అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.*పల్లె ప్రజల కోసం కట్టుబడి పని చేస్తామన్న ఎమ్మెల్యే*’న్యాయం – సమానత్వం – స్వేచ్ఛ – సోదరభావం… అంబేద్కర్ ఇచ్చిన ఈ విలువలే మన దేశ ప్రగతికి మూలాధారం’ అని ఎమ్మెల్యే సంజయ్ పేర్కొన్నారు. పేదల కోసం, పల్లె ప్రజల కోసం, విద్యావంతమైన సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు పాల్గొని అంబేద్కర్ తత్వాన్ని స్మరించుకున్నారు.—–

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News