నేటి సాక్షి 26 నందికొట్కూరు:—నందికొట్కూరు మండలం శాతనికోట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జయసూర్య .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారత రాజ్యాంగం రూపకల్పనలో డాక్టర్ అంబేద్కర్ గారి కీలక పాత్రను స్మరించుకున్నారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలకు పునాది వేసిన భారత రాజ్యాంగం కోట్లాది భారతీయులకు మార్గదర్శకంగా మారిందన్నారు. సామాజిక సమానత్వం సాధన కోసం అంబేద్కర్ గారు చేసిన అవిశ్రాంత కృషి ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.రాజ్యాంగం పట్ల ఆయన చూపిన అపరిమిత నిబద్ధత, దేశ ప్రజల అభ్యుదయానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ, యువత రాజ్యాంగ విలువలను ఆచరించి సమగ్ర భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పిలుపునిచ్చారు.అనంతరం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య,కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రసాదరెడ్డి, జనసేన నియోజకవర్గ నాయకులు రవికుమార్, గ్రామ మరియు మండల నాయకులు పాల్గొనడం జరిగినది.





