Thursday, February 26, 2026

*అకాల వర్షాలతో మొక్కజొన్న, మామిడి పంటలకు తీవ్ర నష్టం** నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి* జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్—–*

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో పలు మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాయికల్ మండలం రామోజీపేట గ్రామంతో పాటు జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో నష్టపోయిన పంటలను జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.*చేతికొచ్చే పంటకు వర్షాల దెబ్బ*రాయికల్ మండలం రామోజీపేట గ్రామంలో మొక్కజొన్న పంటలు నేలకూలగా, మామిడి తోటల్లో పండ్లు రాలిపోయి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. అలాగే చల్గల్ గ్రామానికి చెందిన రైతులు రాజేందర్, వెంకటస్వామి గార్ల మొక్కజొన్న పంటలు కూడా వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికే అకాల వర్షాలు నష్టం కలిగించాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.*వెంటనే నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలి*ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ, నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందజేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం, ఎరువులు, 24 గంటల కరెంటు సకాలంలో అందించడంలో విఫలమైందని విమర్శించారు. “కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటు ప్రకృతి కూడా రైతులపై కన్నెర్ర చేసింది” అని వ్యాఖ్యానించారు.*వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కెసిఆర్‌దే*బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికే దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. రైతుబంధు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతులకు భరోసా కల్పించామని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో మండల అధ్యక్షులు బర్కాం మల్లేష్, ఆనందరావు, కోఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు, మాజీ సర్పంచ్ ఎల్ల రాజన్న, గ్రామ శాఖ అధ్యక్షుడు పూదరి శ్రీను, వార్డు మెంబర్ బొల్లారం ముత్యం, బాలే చందు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉదయశ్రీ, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట గంగరాజం, మాజీ వైస్ ఎంపీపీ మహేశ్వర్ రావు, యూత్ అధ్యక్షుడు బడుగు గోపాల్, కుంట వెంకన్న, చింతలపల్లి దేవన్న, దాసరి నరసయ్య, అల్లం నాగస్వామి, ఓగులపు రాజేందర్, చిన్న కోల నరేష్, బీఆర్ఎస్ నాయకులు రామపతి రావు, రాజేందర్ గౌడ్, ప్రశాంత్ రావు, సత్యం గౌడ్, గంగారం లక్ష్మణ్, కన్నాక మహేందర్, గడ్డం మల్లారెడ్డి, నరేష్ తదితరులు, రైతులు పాల్గొన్నారు.______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News