Saturday, March 7, 2026

*అక్రమంగా తరలిస్తున్న లక్షయాబై వేల రూపాయలు సిజ్* *చెన్నూర్ సి ఐ బన్సీలాల్*మంచిర్యాల జిల్లా,, ఫిబ్రవరి09 :

నేటి సాక్షి చెన్నూరు మున్సిపల్ 15వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి గుర్రం ఉమారాణి శ్రీనివాస్ లకు చెందిన లక్ష యాభై వేల రూపాయల నగదును టౌన్ సీఐ బన్సీలాల్ తమ సిబ్బంది తో కలిసి పట్టుకున్నారు.ఎన్నికల భాగంగా విధులు నిర్వహిస్తున్న సమయంలో పోలీస్ వారికి వచ్చిన సమాచారం మేరకు స్థానిక ప్రతాప మారుతి హనుమాన్ టెంపుల్ దగ్గర పట్టణానికి చెందిన పడమటింటి శ్రీనివాస్ అనే వ్యాపారిని తనిఖీ చేయగా లక్ష యాబై వేల రూపాయలు లభిచడంతో విచారణ చేపట్టిన పోలీసులకు తన మిత్రుడు(గుర్రం శ్రీనివాస్) అవసరం కొరకు డబ్బులు తీసుకువెళ్తున్నట్లు తెలడం తో డబ్బులు స్వాధీనం చేసుకొని ఎన్నికల ప్రత్యేక (ఎఫ్ఎస్ టీ) ఫ్లైయింగ్ స్క్వాడ్ కు అందజేశారు. ఎన్నికల దృశ్య ప్రజలు, వ్యాపారులు ఎలాంటి కారణాలు లేకుండా అధిక మొత్తంలో డబ్బులు మరియు లావాదేవీలు చేసినట్లయితే ఎన్నికల నిబంధనల ప్రకారం సీజ్ చేయడం జరుగుతుందని పట్టణ సీఐ బన్సీలాల్ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News