Tuesday, March 17, 2026

అక్రమంగా మత్తు మాత్రలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్-విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన :డిఎస్పీ రాజశేఖర్ రాజు..

నేటిసాక్షి, మిర్యాలగూడ : చట్ట వ్యతిరేకంగా మత్తు మాత్రలు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేసు వివరాలు వెల్లడించారు..శనివారం ఉదయం ఈదులగూడ సెంటర్ లో పోలీసులు రోజు వారీ విధుల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా చేతిలో కవర్లు పెట్టుకొని తిరుగుతుండగా వారిని విచారించగా కారంపొడి లోని వీరభద్ర మెడికల్ అండ్ ఫాన్సీ షాపులో మత్తుమాత్రలు కొనుకొచ్చినట్లు తెలిపారని డిఎస్పి రాజశేఖర్ రాజు తెలిపారు. పట్టుబడిన వారిలో మిర్యాలగూడ సీతారాం పురానికి చెందిన మచ్చ నవీన్ (23)తండ్రి సైదులు, నక్క మహేష్(22) తండ్రి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాకు చెందిన హనుమంతరావు (58)తండ్రి కోటి వీరయ్య లను అదుపులోకి తీసుకొనగా, శెట్టి జయ రామ చంద్ర ప్రసాదు (31) పరారీలో ఉన్నట్లు తెలిపారు. మీరు ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్పాస్మో ప్రోగ్సీ వొన్ ప్లస్ అధిక ధరలకు విక్రయిస్తుండగా 240 టాబ్లెట్స్ పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. వీరిపై సిఆర్ నెంబర్348/2025 యు /యస్ 8 యు /ఎస్ 318(4),316(2) బిఎన్ఎస్ మరియు సెక్షన్22(బి )27(A)29 ఎన్ డిపిఎస్ యాక్ట్ 1985 ప్రకారం మిర్యాలగూడ లోని మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసును చేదించిన మిర్యాలగూడ మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ ఎం. నాగభూషణరావు, ఎస్సై ఏ. సైదిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాజారామ్, కానిస్టేబుల్స్ వీరబాబు, నరసింహ, ప్రసాద్, శ్రీను, హుస్సేన్ లను డిఎస్పి రాజశేఖర్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News