Sunday, March 8, 2026

అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్న మున్సిపల్ అధికారులు, నాలా ఆక్రమణ అరికట్టాలి

కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జూన్ 19

కాగజ్ నగర్ పట్టణంలోని వసుంధర డిగ్రీ కళాశాల వద్ద చర్చ్ పక్కనగల వీఐపీ విద్యాసంస్థల వారు అక్రమంగా నాలాను కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను ఈరోజు గురువారం తెల్లవారుజామున నుండి కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఆధ్వర్యంలో జెసిబి తో కూల్చుతున్నారు. ఈ కూల్చివేత కార్యక్రమంలో టిపిఓ, మరియు మున్సిపల్ సిబ్బంది, పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాగజ్నగర్ పట్టణ ఎస్ హెచ్ ఓ ప్రేమ్ కుమార్ రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ మరోపక్క వార్డ్ నెంబర్ 22 లో కాగజ్ నగర్ పట్టణంలోని ప్రధాన నాలాను ఆక్రమించి అక్రమ నిర్మాణాలను విఐపి స్కూల్ భవనాలను కూల్చివేసిన మున్సిపల్ అధికారులను , సిబ్బందిని అభినందించాల్సిందే. కానీ పట్టణంలోని 22వ వార్డులో తీరం దాస్ థియేటర్ వెనక భాగంలో ప్రధాన నాలాను ఆక్రమించుకొని ఒక వ్యక్తి అక్రమంగా భవన నిర్మాణం చేపడుతున్నారు. మురుగునీటి కాలువను పూర్తిగా ఆక్రమించుకొని కాల్వలో నే బేస్మెంట్ నిర్మాణం చేపడుతున్నారు. పట్టపగలే అక్రమ అక్రమ నిర్మాణం చేపడుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు సిబ్బంది ఈ విషయాన్ని గమనించి అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News