బారాస మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి
నేటి సాక్షి, బెజ్జంకి:
మండల కేంద్రంలో బారాస మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మండలంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు ఎక్కువైపోయాయని, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసుల విషయంలో దరఖాస్తులు ఇస్తే తీసుకోకుండా అధికార పార్టీ నాయకుల దరఖాస్తులు వారికి ఇష్టం వచ్చినట్టు రాసుకొని ఇస్తే తీసుకొని కేసులు నమోదు చేస్తున్నారని, ఏ విచారణ చేయకుండానే మా కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని తప్పు చేస్తే ఎవరిపై నైయినా చర్యలు తీసుకోవచ్చని,బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు చూస్తూ ఊరుకోమని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే మాటలు విని కేసులు నమోదు చేస్తే న్యాయపోరాటం చేస్తామని, ఇలాగే అక్రమ కేసులు పునరావృతమైతే రాస్తారోకోలు ధర్నాలతో రాజీవ్ రహదారిని నిర్బంధిస్తామని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, కాచు రాజయ్య, నలువాల స్వామి, రాజమహేందర్ రెడ్డి, చిలుకల తిరుపతిరెడ్డి, ముఖిస తిరుపతిరెడ్డి, గుబిరె మల్లేశం, హనుమండ్ల లక్ష్మారెడ్డి, వీటి బాలనర్సు, ముక్కిస తిరుపతిరెడ్డి, చింతకింది శ్రీనివాస్ గుప్తా, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.





