Thursday, March 19, 2026

*అక్రమ కేసులో చెవిరెడ్డి అరెస్టు అన్యాయం: ఎమ్మెల్యే చంద్రశేఖర్**-చెవిరెడ్డి నివాసంకు వచ్చిన ఎమ్మెల్యే చంద్రశేఖర్*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాళెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి ఆదివారం చేరుకున్నారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికి ఇంటిలోకి ఆహ్వానించారు. అనంతరం ఇంటిలో హర్షిత్ రెడ్డి ద్వారా ఎమ్మెల్యే చంద్రశేఖర్ అక్రమ మద్యం కేసు లో అరెస్టయిన చెవిరెడ్డి ఆరోగ్యం, బెయిల్ గురించి ఆరా తీశారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో నిత్యం ప్రజలకు ఏదో ఒకరకంగా మంచి చేసే ప్రజా నాయకుడు చెవిరెడ్డిని 159 రోజులుగా అక్రమ నిర్బంధంలో పెట్టడం అన్యాయమన్నారు. చెవిరెడ్డిని ఆదరించి అభిమానించే ప్రతి ఒక్కరికీ తెలుసని, అవకాశం వచ్చినపుడు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు. చెవిరెడ్డి కుటుంబానికి పార్టీతో పాటు తాము అండగా ఉంటామని వెల్లడించారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో కడిగిన ముత్యంలా చెవిరెడ్డి బయటకు వస్తారని అప్పటి వరకు ధైర్యంగా ఉండాలని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News