రాజేంద్రనగర్, ఆగస్టు 31( నేటి సాక్షి )
రాజేంద్రనగర్ జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని గగన్ పహాడ్ ప్రాంతం అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిందని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ యదేచ్చగా పనులు కొనసాగిస్తున్న నిర్మాణదారులు.
నోటీసులు ఇచ్చినా ఫలితం శూన్యం:
స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాంతంలో ముఖ్యంగా భారీ షెడ్లు, ఇతర అక్రమ కట్టడాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారీ శ్రీధర్ బాబు నోటీసులు ఇచ్చినా, అక్రమ నిర్మాణాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
అధికారుల మౌనంపై అనుమానాలు :
అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టడంలో అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నప్పటికీ, వాటిని అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని నిలదీస్తున్నారు,ఈ సమస్యపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.





