Sunday, March 8, 2026

*అక్రమ మట్టి తరలింపు పై ప్రజల ఆందోళన*

*నేటి సాక్షి-మేడిపల్లి* మేడిపల్లి మండలం కొండాపూర్ విలయతబాద్ గ్రామాల పొలిమేర వరద కాలువ నుండి అక్రమ మట్టి తరలింపు పై ప్రజలు ఆందోళన చెందుతున్నారు గత కొన్ని నెలలుగా మొరము మట్టిని అక్రమంగా తిప్పారు లారీల ద్వారా ఇతర గ్రామాలకు తరలిస్తున్నరూ ఈ అక్రమ మట్టి తరలింపు ఎక్కువగా ప్రతిరోజు రాత్రి 10:00 నుండి తెల్లవారుజాము 5 గంటల వరకు గ్రామ ప్రజల కళ్ళుగప్పి జరుగుతుండటం తీవ్ర ఆందోళన గురిచేస్తుంది బరువైన టిప్పర్ లారీలు గ్రామీణ రహదారులపై తిరగడం వల్ల రహదారులు పూర్తిగా ధ్వంసమై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి రైతులు వాహనదారులు మహిళలు విద్యార్థులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు భవిష్యత్తులో మా గ్రామాలకు అవసరమైన మట్టి వనరులు కొరతకు గురయ్యే ప్రమాదం ఉంది ఈ అక్రమ చర్య పై ఇప్పటికే మేము మేడిపల్లి మండలం తహసిల్దార్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాం అలాగే జిల్లా కలెక్టర్ సంబంధిత పోలీస్ శాఖ గ్రామపంచాయతీలకు కూడా నోట్ కాపీలు అందజేయడం జరిగింది అధికారులు వెంటనే స్పందించి అక్రమ మట్టి తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాం ధ్వంసమైన గ్రామ రహదారులను పునరుద్దించాలని మా గ్రామ ప్రజలు తరఫున డిమాండ్ చేస్తున్నాం అధికారులు తక్షణమే స్పందించకపోతే గ్రామ ప్రజలు కలిసి శాంతియుతంగా ఉద్యమానికి దిగాలిసి వస్తుందని మీ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో గ్రామ వికాసాయి ఐక్యవేదిక కొండాపూర్ ఎద్దండి భూమయ్య,మునుగురి హనుమంతు, పిట్టల నారాయణ, చేకూరి రాజేశం ఎదలాపురం దుబ్బ రాజం, డప్పు ప్రేమ్ కుమార్, బొల్లారపు బాబు,పెదరాపురం గంగరాజం, డప్పు భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News