Monday, March 9, 2026

*అక్షరమాల ద్వారా వయోజన విద్యాభివృద్ధి* *జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్*మంచిర్యాల జిల్లా,, జనవరి 31,

నేటి సాక్షి ప్రభుత్వం చేపట్టిన అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా వయోజన విద్య అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ అన్నారు. జిల్లాలోని హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, గ్రామపంచాయతీ సర్పంచ్ మిట్టపల్లి రామ్ రెడ్డి లతో కలిసి ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మాట్లాడుతూ అక్షరాలు దిద్ది చదువు నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని, 15 నుండి 60 సంవత్సరాల లోపు వారందరూ చదువుకోవాలని, అప్పుడే సమాజంలో గౌరవ స్థానం లభిస్తుందని అన్నారు. ఉల్లాస్ అక్షరాస్యత కేంద్రాలకు నిరక్షరాస్యులు ప్రతి ఒక్కరు రావడమే కాకుండా చదువు నేర్చుకుని 100 రోజుల్లో అక్షరాస్యులుగా తయారు కావాలని, అక్షర వికాసం పుస్తకంలోని 16 చాప్టర్ లను 100 రోజులలో పూర్తి చేయాలని తెలిపారు. వయోజన విద్య నేర్చుకుంటున్న మహిళా సంఘ సభ్యులు అక్షరాస్యతతో కీలక జీవన నైపుణ్యాలు నేర్చుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అక్షర కేంద్రం వాలంటీర్లు శిరీష, దాసరి శ్యామల, జె డి ఎం రామచందర్, ఎ పి ఎం వెంకటేష్, సి సి లు మోహన్, కృపవర్ణ, రాజమణి, వి ఓ ఎ లు, సంఘ సభ్యులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News