నేటి సాక్షి,బాపట్ల జిల్లా(బాపట్ల టౌన్)అక్షర్ విద్యా భవన్ పాఠశాలలో షణ్ముక నేత్రాలయ సౌజన్యంతో విద్యార్థుల కోసం ఉచిత నేత్ర పరీక్ష శిబిరం నిర్వహించారు. నేత్ర వైద్యులు డా. కార్యంపూడి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో సిబ్బంది రాజేష్, ఇందిర శ్రమతో ఈ శిబిరం విజయవంతంగా జరిగింది. దాదాపు 30 మంది విద్యార్థుల్లో చూపు సమస్యలు గుర్తించి వారికి తగిన సూచనలు అందించారు. ఈ శిబిరానికి సెంటిస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రాయోజకత్వం వహించింది. సంస్థ ప్రతినిధులు వెంకట నారాయణ, జగదీశ్ పాల్గొని విద్యార్థుల ఉత్సాహాన్ని అభినందించారు. కార్యక్రమంలో భాగంగా కంపెనీ చిత్రలేఖనం పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. డా. వెంకటేశ్వర్లు కంటి సంరక్షణ, శుభ్రత, వ్యాయామాల ప్రాధాన్యతపై విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇచ్చారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరాజు ఆయనను శాలువా, మొమెంటోతో సన్మానించారు. ఈ సందర్భంలో ప్రధానోపాధ్యాయురాలు రత్నమాల, ఉపాధ్యాయురాలు పుష్పలత తదితరులు పాల్గొన్నారు.





