నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):
చందుర్తి మండల కేంద్రంలో మహాలక్ష్మి ఆలయంలో సాధు సజ్జన భజన మండలి వారి ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పర్వదినాన నిర్వహించే అఖండ భజన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రభుత్వ విప్ మట్లాడుతూ ప్రజలందరికీ తొలి ఏకాదశి పర్వదినాన శుభాకాంక్షలు తెలిపారు. సాధు సజ్జన భజన మండలి వారు గత 21 సంవత్సరాల క్రితం వర్షాలు లేకుంటే అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించి అఖండ భజనను ప్రారంభించారని ఆనాటి నుండి 21 సంవత్సరాలుగా అఖండ భజన నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో తను కూడా నిర్విరామంగా 21 సంవత్సరాలుగా అమ్మవారిని దర్శించుకొని భజనలో పాల్గొనడం జరుగుతుందని పేర్కొన్నారు.
21 సంవత్సరాల క్రితం విప్ దీపా ధారణ చేశారని, ఇప్పటివరకు స్వయంగా వచ్చి దీపదారణ చేస్తున్నానని పదవి ఉన్నా లేకున్నా వస్తున్నట్లు తెలిపారు.
అనాడు ఒకే రోజు చందుర్తి మండల కేంద్రంలో మూడు దేవాలయాలకు నిధులు వచ్చి దేవాలయాల నిర్మాణానికి అంకురార్పణ చేయడం జరిగిందని తెలిపారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఆస్టశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు.





