Friday, March 13, 2026

అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ విజయవంతం***బీసీ సంఘం మండల అధ్యక్షుడు మార్గం మల్లేశం, బీసీ సంక్షేమ సంఘము జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లెల జగన్ మోహన్ ఆధ్వర్యంలో

నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):*తెలంగాణా బీసీ సంఘాల జెఏసీ ఇచ్చిన పిలుపు మేరకు వారికి మద్దతుగా గన్నేరువరం మండల కేంద్రంలో శనివారం రోజున అఖిల పక్ష రాజకీయ పార్టీల మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి షాప్ లను మూసివేసి బంద్ పాటించారు. ఈ సందర్బంగా బీసీ సంక్షేమ సంఘము జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లెల జగన్ మోహన్ మాట్లాడుతూ బీసీ ల 42% రిజర్వేషన్ కొరకు అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాడి బిల్లును రాజ్యాంగ సవరణ ద్వారా సాధించుకోవాలని అన్నారు. గన్నేరువరం మండలం కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు మార్గం మల్లేశం మాట్లాడుతూ 42% బిసి రిజర్వేషన్ సాధన కొరకు బిసి కుల సంఘాలన్నీ ఐక్యంగా పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లెల లక్ష్మణ్ పాకాల పర్శరాము బుర్ర తిరుపతి గౌడ్, బుర్ర మల్లయ్య గౌడ్ గూడూరి సురేష్ బూర వెంకటేశ్వర్ బోయిని అంజయ్య కాంతాలా అంజిరెడ్డి, బోయిని మల్లయ్య, బొమ్మ కంటి అంజయ్య చారి, మీసం లక్ష్మణ్, కల్లేపల్లి భూమయ్య, కుంభం మహేష్ రంగనవేణి శ్రీనివాస్,బోయిని అనిల్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News