నేటి సాక్షి చిలుకూరు.. చిలుకూరు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక రైతు కూలీలు సమస్యలపైఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు కనీస వేతనాలను చెల్లించాల్సిన బాధ్యతనుండి యాజమాన్యాలు తప్పుకునే విధంగా కార్మిక చట్టాలను సవరణ చేసిందని దేశంలోని పెట్టుబడిదారులకు కార్పొరేట్ వర్గాల వ్యక్తులకు బిజెపి ప్రభుత్వం ఊడిగం చేస్తుందని దుయపట్టారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు సంబంధించి నల్ల చట్టాలను తీసుకువచ్చి గ్రామాల్లోని కూలీలకు ఉపాధి లేకుండా చేయడం కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సైతం రద్దు చేయడానికి ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని అన్నారు . అధికారంలోకి వస్తే దేశంలో ప్రతి ఏటా కోటి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందని వారు అన్నారు. దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు రోజురోజుకీ నింగిని అంటుతున్నాయని పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు నిత్యవసర వస్తువుల ధరలు అతివేగంగా అత్యంత ఖరీదైనవి కావడం వలన కేంద్రంలోని బిజెపి ప్రజా సమస్యలపై స్పందించి వాటికి పరిష్కారం మార్గాలు చూపాలని లేనిపక్షంలో భవిష్యత్తులో ఈ బిజెపి ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పిల్లుట్ల కనకయ్య ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి కొండలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డ వెంకటయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రెమిడీల రాజు సిపిఐ చిలుకూరు గ్రామ కార్యదర్శి చిలువేరు ఆంజనేయులు సిపిఐ సీనియర్ నాయకులు కస్తూరి సైదులు, కట్టెకోల నాగేశ్వర్ రావు, సుల్తాని వెంకటేశ్వర్లు, దొంతగాని వీరస్వామి, దొడ్డ నాగేశ్వర్ రావు, మాదారపు లక్ష్మయ్య, పుట్టపాక అంజయ్య, అనంతుల రాము, బాలబోయిన మహేష్, పదిరే మహేష్, కొండ శేషయ్య, పిల్లుట్ల కనకారావు, మాదారపు వెంకటేశ్వర్లు, మండవ అంజయ్య, రవీందర్ రెడ్డి, టైలర్ మౌలానా, వెల్డింగు పాషా, గండెల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు….

