నేటి సాక్షి జనవరి 19అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎ బి జె పి ఎఫ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ తాళ్లపల్లి రమేష్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.గత కొన్నేళ్లుగా జర్నలిజం రంగంలో రమేష్ గౌడ్ అందిస్తున్న సేవలను, జర్నలిస్టుల సమస్యలపై ఆయనకున్న అవగాహనను గుర్తించి రాష్ట్ర కమిటీ ఈ బాధ్యతలను అప్పగించింది. జర్నలిస్టుల హక్కుల రక్షణ కోసం, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా రమేష్ గౌడ్ పేర్కొన్నారు.తన నియామకానికి సహకరించిన జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు, మీడియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అకాడమీ చైర్మన్, ఇసంపెల్లి వేణు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బింగిసుధాకర్, అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొడక్షన్స్ ఫోర్స్ రాష్ట్ర చైర్మన్ చుంచు కుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పర్కాల సమ్మయ్య గౌడ్, తోటి జర్నలిస్ట్ మిత్రులకు రమేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. రమేష్ గౌడ్ నియామకం పట్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరియు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

