Thursday, March 19, 2026

అగ్ని ప్రమాదంలో వరి ధాన్యం దగ్ధం

నేటి సాక్షి, నల్లబెల్లి ప్రతినిధి డిసెంబర్ 12: నల్లబెల్లి మండలకేంద్రం గ్రామ శివారు వెంకటపాలెం చెరువు కింద వున్నా పొలంలో వరి కోతల అనంతరం గుర్తుతెలియని వ్యక్తులు పొలం గట్లకు నిప్పు పెట్టడంతో పక్కనే ఉన్న నల్లబెల్లి గ్రామానికి చెందిన మాటూరు హరీష్, చుట్టుపక్కల ఉన్న కొంతమంది రైతుల కళ్ళంలో ఎండబోసిన ధాన్యము, బస్తాలు అగ్నిప్రమాదానికి గురైంది. వెంటనే విషయం తెలుసుకున్న రైతులు మంటలు ఆర్పడానికి ఎంత ప్రయత్నించినా ప్రమాదంలో కొంతమేర ధాన్యం నష్టం జరిగింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అంతా కాలిపోవడంతో బాధిత రైతులు కన్నీరు మున్నీరై విలపించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News