ప్రవీణ్ కుమార్ (ఎస్ ఐ)
నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్)
మునగాల మండల పరిధిలోని గ్రామాల ప్రజలు వేసవికాలంలో అగ్గి ప్రమాదాల పట్ల అప్రమత్తతతో ఉండాలని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
వంట గది.. పంట చేలు.. షాపింగ్‌మాల్స్.. ఆసుపత్రులు.. విద్యాసంస్థలు.. ఆఫీసులు.. పెట్రోల్‌బంకులు.. ఇలా స్థలమేదైనా సరే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేసవికాలం వచ్చింది కదా అందుకే. సహజంగా వేసవిలోనే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తుంటాయని మనందరికీ తెలుసు అని ప్రధానంగా గ్రామాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ పనులు ముగియడంతో ఆయా పంటచేనులో ఎండిన గడ్డి, ఇతర పంట వ్యర్థాలను కాల్చి వేస్తుంటారు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే గాలికి నిప్పురవ్వలు ఎగిరి సమీపంలో ఉన్న గడ్డివామి లేదా ఇంటి పరిసరాల్లో పడితే మంటలు దావనంలా వ్యాప్తి చెందుతాయి. పట్టణ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా విద్యుత్ సంబంధిత అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ప్రధానంగా ఎండ తీవ్రతను తట్టుకునేందుకు షాపింగ్‌మాల్స్, ఆసుపత్రులు, ఇతర వ్యాపార సముదాయాలతోపాటు నివాసాల్లో ఏసీలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈక్రమంలో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ ఉపకరణలు షాట్ సర్యూట్‌కు గురై మంటలు వ్యాపిస్తుంటాయి. ఇలా అగ్ని ప్రమాదం ఏరూపంలో ఉన్నప్పటికీ ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టమూ వాటిల్లుతుంది. అందుకే వేసవికాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంత్తైన ఉందని తెలిపారు.

