నేటి సాక్షి, బాపట్ల జిల్లా (ఛందోలు)సేవే మార్గం, సేవే లక్ష్యం గా పేదలకు అండగా భరోసా కలిపిస్తున్న నిజామ్నిరుపేదలకు సాయం చేయటమే తన జీవిత ధ్యేయంగా పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చందోలు గ్రామస్తుడు, టీడీపీ యువ నాయకుడు నిజామ్. ఆదివారం జుల్ఫా లాంఫా లో విద్యుదాఘాతంతో బాజీ బేగ్ పూరిల్లు పూర్తిగా దగ్ధం అయింది. ఈ సంఘటనతో కట్టు బట్టలతో అన్నీ కోల్పోయి వారు బయట పడ్డారు. తినటానికి తిండి లేక, ఉండటానికి గూడు లేక అనేక ఇబ్బందు లు పడుతున్నారు.విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకులు నిజామ్ బాధిత కుటుంబానికి20000ఆర్ధిక సాయం చేసి భరోసా కలిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కష్టాలు తీర్చటమే నా జీవిత ఆశయం అన్నారు. ఇలాంటి సంఘట జరగటం చాలా బాధాకరం అన్నారు. సేవా తత్పరులు వీరి లాంటి వారికి సాయం చేయాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు షేక్ బాజి, అమీరా, సలీం,అన్వర్ బేగ్,గౌస్ బేగ్, జాకీర్,తాజూ,తదితరులు పాల్గొన్నారు.





