నేటి సాక్షి, కరీంనగర్: కరీంనగర్లోని కొత్తపల్లి అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్లో సోమవారం డాక్టర్స్డే, చార్టర్డ్ అకౌంటెంట్స్డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వైద్యులు, సీఏల గొప్పతనాన్ని వివరిస్తూ విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు ఆలోచింపజేశారు. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్రెడ్డి హాజరై మాట్లాడారు. సమాజంలో డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్ చాలా గొప్పగా వ్యవహరిస్తారని చెప్పారు. వారి కృషి సమాజ అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
1991 నుంచి వైద్యుల దినోత్సవాన్ని ఐఎంఏ వారు నిర్వహిస్తున్నారని, సీఏల దినోత్సవాన్ని ఐసీఏఐ వారు నిర్వహిస్తూ వారి సేవలను గుర్తిస్తూ జాతీయ స్థాయిలో సన్మానం చేస్తారని తెలిపారు. వైద్యులు ఎటువంటి విరామం లేకుండా ప్రజల జీవితాలను కాపాడుతూ వారి జీవితాల్లో గొప్పగా ఉంటున్నారని తెలుపుతూ దేశ రాజధాని ఢిల్లీలో ప్రదానమంత్రి చేతులమీదుగా అత్యుత్తమ వైద్యులకు ఘనసత్కారం ఉంటుందని చెప్పారు.అదే విధంగా సీఏల పాత్ర చాలా విశిష్టమైనదని, వారి వలన దేశపురోభివృద్ధిచెందుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వివిధ విభాగాల వైద్యులు, సీఏలు, టీచర్ల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.