Saturday, March 7, 2026

అడవి పందుల వలన నష్టపోయిన రైతులకు చెక్కులను పంపిణీ చేసిన ఫారెస్ట్ రేంజ్ అధికారిణి ప్రణీత భాయి..

నేటి సాక్షి 06 ఫిబ్రవరి కొత్తపల్లె :-కొత్తపల్లి మండలంలోని,గ్రామాల్లో ఉన్న రైతుల మొక్కజొన్న పంటలపై అడవి పందుల దాడిలో నష్టపోయిన మొక్కజొన్న రైతులకు ఫారెస్ట్ రేంజ్ అధికారిణి ప్రణీత భాయి నష్టపరిహారం చెక్ లను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారిణి ప్రణీతాబాయి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రైతులు తమ వ్యవసాయ పొలాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేసుకుంటున్న తరుణంలో అడవి పందుల బెడద నుంచి నష్టపోయిన మొక్కజొన్న రైతులకు ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో చెక్ లను అందజేయడం జరిగిందన్నారు. కొత్తపల్లి మండలంలోని, పెద్ద గుమ్మడాపురం, చిన్న గుమ్మడాపురం రైతులకు 54 మందికి పరిహారం చెక్ లు మంజూరు అయ్యాయన్నారు. ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో ఒక ఎకరా కు 10 వేల వరకు నష్టపరిహారం అందజేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో రైతు పంట ఎంత మేరకు నష్టం జరిగింది పరిశీలించి నష్టాన్ని అంచనా వేసిన తర్వాతే పరిహారం మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే నల్లమల్ల అడవులకు సమీపంలో ఉన్న రైతులందరూ తమ పంట పొలాలు వేసిన సమయంలో అడవి జంతువులకు ఎలాంటి హాని కలిగించరాదన్నారు. పంటలను నాశనం చేయకుండా అడవి జంతువులను శబ్దాలతో బెదిరించాలి తప్ప హాని చేస్తే చట్ట పరమైన చర్యలు ఉంటాయని రైతులకు సూచించారు. ఈ చెక్ ల పంపిణీ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మద్దిలేటి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లు సలాముల్ల, పాములేటి, రైతులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News