Monday, March 16, 2026

*అడిగేదెవరు–ఆపేదెవరు*• సమయపాలన పాటించని కార్యదర్శులు…• అటకెక్కిన ప్రజాపాలన 99రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమం• ఫేస్ రికగ్నిషన్ దుర్వినియోగంపై కలెక్టర్ దృష్టి పెట్టాలి• మండల అధికారుల సహకారమే కార్యదర్శుల ఆయుధం• విలేఖర్ల ఫిర్యాదుతో ఆదివారం కార్యాలయాలకు పరుగులు పెట్టిన కార్యదర్శులు…

నేటి సాక్షి కోదాడ (అనంతగిరి)ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లాలన్న సంకల్పంతో ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ పంచాయితీ లక్ష్యం నెరవేరడం లేదు.ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కార్యదర్శులు తమ విధులు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు.అధిక శాతం మంది ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. మరికొందరు హాజరు పట్టికలో సంతకాలు చేసి కార్యాలయాల్లో లేకుండా ఉడాయిస్తున్నారు.ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్న పంచాయతీ కార్యదర్శులు అనధికారికంగా విధుల నిర్లక్ష్యంతో గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులు లేక కాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న కార్యాలయం ప్రజలకు సమాధానం చెప్పే అధికారులు లేకపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గ్రామపంచాయతీ అధికారులు సమయపాలన పాటించడం లేదని,ఎప్పుడు గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చిన కాళీ కుర్చీలతో దర్శనమిస్తున్నయని ప్రజలు వాపోతున్నారు.గ్రామంల్లో సమస్యను ఎవరికి చెప్పుకోవాలి తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామ పంచాయతీ కార్యదర్శి సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి మండల వసూలు డిమాండ్ చేస్తున్నారు.*అటకెక్కిన ప్రజాపాలన 99రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమం*గ్రామాల్లో ప్రస్తుతం అపరిశుధ్యం నెలకొంది. గ్రామ శివారు ప్రధాన వీధుల్లో చెత్త కుప్పలు స్వాగతం పలుకుతూ పరిసర నిర్వాసితు లకు ఇబ్బందిగా మారుతున్నాయి. చిన్న పంచాయతీల్లో సైతం ప్రభుత్వం పారిశుధ్యం మెరుగుకు చర్యలు చేప డుతున్నా ప్రజల్లో అవగాహన లోపానికి సిబ్బంది నిర్లక్ష్యం తోడై సమస్య తీరడం లేదు. గ్రామంలో పలు వీధుల్లో గల చేతిపంపుల చుట్టూ ఉండే పరిశుభ్రత సమస్య చెప్పవలసినవి కావని తీవ్ర అపరిశుధ్యం మధ్య నీటిని పట్టుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నా యని, దీని వల్ల రోగాల బారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు.అడుగడుగునా డ్రైనే జీలు చెత్తతో నిండి ఉన్నాయి.పలు వీధుల్లో నెలల తర బడి పోగుబడి ఉన్న చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి.పరిస్థితికి తగ్గట్టుగా గ్రామాల్లో ఎక్కడ చూసినా కనీసం బ్లీచింగ్‌ చల్లిన దాఖలాలు కానరావడం లేదు.ఈ సమస్యలు పరిష్కరించడానికి పంచాయతీ అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ దృష్టి సారించకపోవడం దురదృ ష్టకరమైన విషయం.గ్రామంలో పారిశుధ్యం గురించి మండల స్థాయి అధికారులు కూడా పట్టించుకోకపోవ డమే ఈ పరిస్థితికి కారణమని గ్రామస్తులు ఆరోపి స్తున్నారు.గ్రామంలో పారిశుధ్యం గురించి పట్టించుకో వాల్సిన అధికారులు మచ్చుకైనా పట్టించుకున్న సంఘట నలు లేవని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధు లు పారిశుధ్యంపై దృష్టి సారించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.*విలేఖర్ల ఫిర్యాదుతో ఆదివారం కార్యాలయాలకు పరుగులు పెట్టిన కార్యదర్శులు*గ్రామ పంచాయతీలను అనంతగిరి విలేఖర్ల బృందం ఆదివారం పరిశీలించగా కార్యదర్శుల నిర్లక్ష్యం బట్టబయలైంది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా అధికారులకు,ముఖ్యంగా గ్రామపంచాయతీ కార్యదర్శులకు సెలవు దినాలు రద్దు చేస్తూ ఆదివారం సైతం విధుల్లో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మాకు అవసరంలేదు అన్నట్టు మండల కార్యదర్శులు 10 దాటండి కార్యాలయాలకు హాజరు కావడం లేదు.సమయపాలన పాటించడం లేదని ఎవరైనా మండల అధికారులకు సమాచారం ఇస్తే ఏదో సాకులు చెబుతూ బురిడీ కొట్టిస్తున్నారు.దీనికి తోడు మండల అధికారులు సైతం సహకరించడంతో కార్యదర్శులకు ఆయుధంగా మారి అలసత్వానికి అడ్డు అదుపు లేకుండా పోయింది.*ఫేస్ రికగ్నిషన్ దుర్వినియోగంపై కలెక్టర్ దృష్టి పెట్టాలి*పంచాయతీ రాజ్ అధికారులు సమయపాలన పాటిస్తూ విధుల నుంచి డుమ్మాలు కొట్టకుండా,గ్రామాల్లో సేవలు అందించేందుకు పంచాయతీ రాజ్ శాఖ ముఖ గుర్తింపు హాజరు ఫేస్ రికగ్నిషన్ యాప్ విధానాన్ని అమలులోకి తెచ్చింది.విధానం ప్రకారం ప్రతీరోజు పంచాయతీ కార్యదర్శులు తాము విధులు నిర్వహిస్తున్న గ్రామం నుంచే ఉదయం 10 గంటల లోపే ఫేస్ రికగ్నిషన్ ద్వారా పంచాయతీ రాజ్ యాప్లో హాజరు నమోదు వేసుకోవాలి.అయితే కొందరు పంచాయతీ కార్యదర్శులు విధులకు ఎగనామం పెడుతూ డిజిటల్ అటెండెన్స్ యాప్ను దుర్వినియోగం చేస్తున్నట్లు సమాచారం…? కార్యాలయంలోనే ఉన్నట్లు తీసిన ఫొటోను యాప్లో పెడుతూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.జిల్లా కలెక్టర్ దీనిపై దృష్టి సారించి ఫేస్ రికగ్నిషన్ యాప్ దుర్వినియోగం చేస్తున్న కార్యదర్శులు పైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News