నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల తాహశీల్దారు కార్యాలయంలో కొందరు అధికారులది ఇష్టారాజ్యం నడుస్తోంది.వివిధ సర్టిఫికెట్ల జారీ కోసం వచ్చే ప్రజలను అధికారులు నానా రకాలుగా సతాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.*నెల రోజులుగా తిప్పించుకుంటున్నారు.!*కోరుట్ల మండలం, నాగులపేట్ గ్రామానికి చెందిన వినయ్ అనే దరఖాస్తుదారుడు ‘ఆదాయ-కుల’ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.అతనికి సర్టిఫికెట్‌లు ఇవ్వకుండా అధికారులు గత నెల రోజులుగా సతాయిస్తూ ఆలస్యం చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు కార్యాలయాన్ని చుట్టూ తిరిగినా సర్టిఫికెట్ జారీ చేయకుండా మరింత ఆలస్యం చేస్తున్నారని, ఇందుకు సంబంధించి రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.*అప్లికేషన్ చింపేయ్..నీకు కలెక్టరే ఇత్తడు-పో..అంట.!*నాగులపేట్ గ్రామానికి చెందిన వినయ్ అనే దరఖాస్తుదారుడు ఆదాయం–కుల ధృవీకరణ కోసం దరఖాస్తు చేయగా, ఆలస్యం ఎందుకు జరుగుతోందని గట్టిగా అడిగినందుకు సంబంధిత ఆర్ఐ శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారని తెలిపారు. తనపై కోపంగా మాట్లాడుతూ..ఇతని ‘అప్లికేషన్ చింపేసేయండి… నేరుగా కలెక్టర్ కార్యాలయంలో అప్లై చేసుకుంటాడు’..ఇతనికి కలెక్టరే సర్టిఫికెట్లు ఇత్తడు’ అంటూ సమాధానం ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు. ప్రజలకు సేవలు అందించాల్సిన బాధ్యత ఉన్న అధికారులే ఈ విధంగా వ్యవహరించడం బాధాకరమని బాధితుడు వినయ్ ఆవేదన వ్యక్తం చేశాడు.*ఆర్ఐ శ్రీనివాస్ నిర్లక్ష్య వైఖరిపై ఆరోపణల వెల్లువ.!*ఈ ఘటనకు సంబంధించి కోరుట్ల మండల ఆర్ఐ.శ్రీనివాస్‌నిర్లక్ష్య వైఖరి..అతని బాధ్యతారహిత ప్రవర్తనపై సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల పనులు వాయిదా వేయడం, అవమానకర వ్యాఖ్యలు చేయడం వంటి విషయాలపై ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ఆదాయం–కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసిన వారికి వేగంగా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.*తాహశీల్దారు మౌనం.!?*తన కార్యాలయంలో పనిచేసే ఆర్ఐ శ్రీనివాస్ వ్యవహార శైలిపై వివరణ కోసం ప్రయత్నిస్తే.. సమాధానం చెప్పడానికి సుముఖత చూపకపోవడం విశేషం.ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా స్పందించలేదా.? లేక తన అధికారులను కాపాడుకునే ఉద్ధ్యశ్యంతో వివరణ ఇవ్వడానికి ముందుకు రాలేదా.? లేదా..మేమింతే..మా ఇష్టం..ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్న భావనా.? ఈ మౌనం దేనికి వర్తిస్తుందన్నది..ఆ పై అధికారులకే తెలియాలి.! అందుకే అంటరేమో..’యథా బాస్..తథా ఎంప్లాయిస్’ అని.!!—

