Tuesday, March 17, 2026

అతి దగ్గర్లోనే అన్నా – చెల్లి వైరానికి పుల్ స్టాప్..!వాళ్లు మళ్లీ ఒకటి కాబోతున్నారా..!పులివెందుల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోష్యం..

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 22~అన్నమయ్య జిల్లా :-: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. మరి కొద్ది రోజుల్లో అన్నా – చెల్లి వైరానికి పుల్ స్టాప్ పడనుంది. మళ్లీ యధావిధిగా దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో మళ్లీ సందడి రోజు రాబోతోంది. మాజీ సీఎం జగన్ – పీసీసీ చీఫ్ షర్మిల గురించి మరో సారి చర్చ మొదలైంది. తన అన్న జగన్ తో విభేదించిన తరువాత షర్మిల తొలుత తెలంగాణలో సొంత పార్టీతో రాజకీయం చేసారు. అక్కడ ఆమె అంతగా రాణించలేదు. తట్టా బుట్టా సర్దుకొని ఆంధ్ర రాష్ట్రం వైపు పరుగులు తీసింది. ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన నాన్న కుటుంబాన్ని ఎంత క్షోభకు గురిచేశారో ఆయన తనయుడు వైయస్ జగన్ ను ఎంత అవమానించారో అవన్నీ గుర్తు రాక రాజన్న కూతురిగా ప్రజలు ఆశీర్వదిస్తారని మళ్లీ కాంగ్రెస్ పార్టీ వంచకు చేరింది. అన్నపై రాజకీయంలో పోటీ పడాలని చూసి బొక్క బోర్లా పడింది. ఏపీలో కాంగ్రెస్ ప్రభావం లేకున్నా కూడా రాజన్న కూతూరంటూ చెప్పుకొని ఆ పార్టీలో చేరి పీసీసీ చీఫ్ అయ్యారు. 2024 లో పోటీ చేసి ఓడిపోయారు. ఈమె ప్రభావం కూడా గత తోడవడంతో ఎన్నికల్లో వైసీపీలో ఓటమి చవి చూసింది. ఎక్కువ సమయం జగన్ ను టార్గెట్ చేయటానికి ప్రాధాన్యతనిచ్చింది. కానీ ఒక్కసారిగా షర్మిల తీరులో కొంత కాలంగా మార్పు కనిపిస్తోంది. అన్నా – చెల్లి తిరిగి కలిసిపోతున్నారని పులివెందుల వైసీపీ సీనియర్ నేత సతీష్ కుమార్ రెడ్డి చెప్పిన అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మాజీ సీఎం జగన్ పీసీసీ చీఫ్ షర్మిల తిరిగి త్వరలోనే కలిసిపోయే సందర్భాలు దగ్గరున్నాయని కడప జిల్లా పులివెందుల కు చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ సతీష్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. జగన్‌కు చెల్లెలంటే అమితమైన అభిమానమని ఆమెను ఏ రోజు కూడా ఒక్క మాట అనలేదని జగన్ పై షర్మిల ఎన్ని విమర్శలు చేసిన చిరునవ్వు చిందించాడు. తప్ప ఆమెపై ఎక్కడ కూడా విమర్శలు చేయలేదు. వైయస్ కుటుంబమంటే జగన్ కు ఎనలేని ప్రేమ. కానీ గొడవలు కారణంగా కొద్ది రోజులు మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. జగన్ ఎప్పుడూ తప్పులు చేయరని సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా వ్యవహరిస్తూ, కూటమిపైనే విమర్శలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. గతంలో చేసిన విదంగా జగన్‌పై ఆరోపణలు చేయడం లేదన్నారు. ఇది మంచి పరిణామమని వైసీపీ కుటుంబ సభ్యులంతా స్వాగతించాల్సిందేనని అన్నారు. జగన్‌కు తన చెల్లెలంటే ప్రత్యేక అభిమానం ఉందని, కుటుంబాన్ని ఎప్పుడూ గొప్పగా భావించే వ్యక్తి జగన్ అని తెలిపారు. తాను జగన్‌ను దగ్గరగా చూశానని, ఆయన ఎప్పుడూ కావాలని తప్పులు చేసే మనిషి కాదని సతీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. అన్నా చెల్లెళ్లు మళ్లీ కలిసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ తో విభేదించిన తరువాత తొలిసారి తన అన్న జన్మదినం వేళ చెల్లెలు శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సమాధానంగా జగన్ సైతం ప్రత్యేకంగా షర్మిలను అమ్మా అంటూ ప్రేమ ఆప్యాయతలు చూపించారు. దీని ద్వారా ఇద్దరి మధ్య తిరిగి సానుకూల వాతావరణం ఏర్పడుతున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే అసలు ఇది సాధ్యమా కాదా అనేది కాలమే డిసైడ్ చేయాల్సి ఉంది. కాగా ఈ వ్యవహారం మాత్రం వైసీపీతో సహా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చగా మారింది. మళ్లీ వైయస్ఆర్ కుటుంబం ఒకటైతే వీళ్లను ఎవరు ఆపలేరనేది జగమెరిగిన సత్యం..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News