నేటి సాక్షి, జిన్నారం: ప్రసిద్ధ శ్రీ జంగంపేట రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో అఖండ లలితా సహస్రనామ పారాయణం నేత్రపర్వంగా సాగింది. వివిధ గ్రామాల నుండి హైదరాబాదు నుండి వచ్చిన మహిళా భక్తులు అఖండ లలితా సహస్రనామ పారాయణాన్ని చేశారు. ఉదయం నాలుగు గంటలకు అభిషేకం నిర్వహించారు. అమ్మవారు లలిత త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చింది. ఆలయ కమిటీ చైర్మన్ శేరికారి వెంకట్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు భక్తులకు తగిన ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస భార్గవ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 160 మంది మహిళలు 11 సార్లు అఖండ లలితా సహస్రనామ పారాయణ అని నిర్వహించారు. ఈ పారాయణంతో ఆలయ ప్రాంగణ పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభతో పండుగ వాతావరణం సంతరించుకుంది. మహిళా భక్తులు అందరూ కూడా దీక్ష వస్త్రాలు ధరించి పారాయణాన్ని నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పారాయణం మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగింది అనంతరం వచ్చిన భక్తులకి భోజన ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ సభ్యులు. భోజనాల తర్వాత వచ్చిన భక్తులకి పసుపు కుంకుమలు అందించారు గ్రామ మహిళా భక్తులు. ఈ పారాయణ కార్యక్రమంలో సువాసిని పూజ ప్రత్యేకత సంతరించుకుంది .
ఈ సందర్భంగా ఆలయ పురోహితులు శ్రీనివాస భార్గవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళా భక్తులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆకాంక్షించారు.
ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి ఇంత భారీగా తరలివచ్చిన మహిళా భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జీవన్ముక్త సంస్థాన పీఠాధిపతి శ్రీ ఉద్ధవ భావ మహారాజ్ పాల్గొన్నారు. భక్తులకు ఆశీర్వచనము అందించారు.