Tuesday, March 17, 2026

*అత్యవసర సమయంలో రక్తదానం చేసిన దొబ్బల వేణు** మానవత్వానికి ముద్ర వేసిన ఉదార హృదయం—*..

నేటి సాక్షి – మేడిపల్లి*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మకిలి ఇజ్రాయిల్‌కు అత్యవసర పరిస్థితుల్లో ఓ పాజిటివ్ రక్తం అవసరం ఏర్పడింది. రోగి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా, రక్తదాతల అనుసంధాన కర్త జిల్లా కన్వీనర్ బంగారు దీపక్‌ను సంప్రదించారు.సమాచారం అందుకున్న వెంటనే MRPS రాయికల్ మండల అధ్యక్షుడు దొబ్బల వేణు స్పందించి, వెంటనే బ్లడ్ బ్యాంక్‌కు చేరుకుని రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో చూపిన మానవత్వంతో వేణు అందరి ప్రశంసలు పొందారు.ఈ సందర్భంగా ధోబ్బల వేణు మాట్లాడుతూ..ప్రతి నాలుగు–ఐదు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ఉంటానన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఫోన్ చేస్తే వెంటనే స్పందించి రక్తం, ప్లేట్లెట్లు అందించడం నా బాధ్యతగా భావిస్తానని వేణు పేర్కొన్నారు.ఈ సందర్భంగా రక్తదాత వేణును బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, జిల్లా కన్వీనర్ బంగారు దీపక్, యువజన సంఘాల సభ్యులు, పాలేపు రమేష్, ఆనందం స్నేహితులు అభినందించారు.______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News